Monday, September 13, 2010

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో

ఈ వేళలో నీవు ఏం చేస్తు వుంటావో
అనుకుంటువుంటాను ప్రతి నిమిషము నేను
నా గుండె ఏనాడో చే జారి పోయింది
నీ నీడగా మారి నా వైపు రానంది
దూరాన వుంటూనే ఏం మాయ చేసావో


ఈ వేళలో నీవు… ఏం చేస్తు వుంటావో
అనుకుంటువుంటాను ప్రతి నిమిషము నేను

నడి రేయిలో నీవు నిదరైన రానీవు
గడిపేదేలా కాలము గడిపేదేలా కాలము
పగలైన కాసేపు పని చేసుకోనీవు
నీ మీదనే ధ్యానము నీ మీదనే ధ్యానము

ఏ వైపు చూస్తున్నా నీ రూపే తోచింది
నువ్వు కాక వేరేది కనిపించనంటోంది

ఈ ఇంద్రజాలాన్ని నీవేనా చేసింది
నీ పేరులో ఏదో ప్రియమైన కైపుంది
నీ మాట వింటూనే ఏం తోచనీకుంది
నీ మీద ఆశేదో నను నిలవనీకుంది
మతి పోయి నేనుంటే నువ్వు నవ్వుకుంటావు…

ఈ వేళలో నీవు
ఏం చేస్తు వుంటావో
అనుకుంటువుంటాను
ప్రతి నిమిషము నేను

ఈ వేళలో నీవు
ఏం చేస్తు వుంటావో
అనుకుంటు.....ము ము హు ము హు హు హు హు హు హు హుః

1 comments:

Anonymous said...

ఇంతకీ ఈ బ్లాగ్ పేరేమిటో? కొరడా నా? కోరడానా?

Post a Comment